
చింతపల్లి(క్రైమ్ మిర్రర్): నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రావటం లేదని, వారి పేర్లు జాబితాలో లేవని, కేవలం అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే అధికారులు ఇండ్లను మంజూరు చేస్తున్నారని అనేక ఆరోపణలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో చింతపల్లి బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎంపిడివో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని చెబుతూ, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు బైటాయించి కూర్చున్నారు..
మంజూరైనా జాబితా ప్రజలకు తెలియకుండా, ప్రతిపక్ష నాయకులకు తెలియకుండా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారని, ప్రతిపక్ష నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.. గత ప్రభుత్వంలో లబ్ధిపొందిన వారు కాకుండా, మిగిలిన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణి చెయ్యాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, నాయకులు అశోక్, ఆంజనేయులు, శంకర్, పెద్దయ్య, యాదయ్య, భాస్కర్, స్వామి, పవన్, నర్సింహా, ఆంజనేయులు, ధనరాజ్, వెంకటేష్, విష్ణు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..