విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్ః విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలు దేరిన ఇండిగో విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. అందులో ప్రయాణిస్తున్న 161 మంది ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలు దేరిన ఇండితో విమానం (6E 579) సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.విమానం గాలిలో ఉండగానే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శబ్దాలు రావడంతో వెంటనే పైలెట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు.
దీంతో స్పందించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా 10.59 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక తనిఖీల అనంతరం ప్రయాణీకులను వారి గమ్య స్థానాలకు తరలించారు. విమానయాన సంస్థ, ఇండిగో సాంకేతిక బృందం ఇంజన్ ఫైల్యానికి కారణాలపై విచారణ చేస్తున్నారు.
