
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇండిగో సంక్షోభం గురించి వ్యాఖ్యనిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారు అని అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. చరిత్రలో ఎప్పుడు కూడా ఈ తరహాలో విమానాల సంక్షోభం సమస్యలు రాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఒకవైపు తెలుగు వారి పరువు గంగలో కలిపావు. మరోవైపు ప్రపంచంలోనే ది గ్రేట్ కంట్రీ అయినటువంటి మన ఇండియా పరువు కూడా పోయింది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై మండిపడ్డారు. వెంటనే తన పదవికి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. గతంలో అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన సమయంలో కూడా రామ్మోహన్ నాయుడు అక్కడికి వెళ్లి మరీ రీల్స్ తీసుకుంటున్నారు అని అతనిపై విమర్శలు గుప్పించిన విషయం ప్రతి ఒకరికి తెలిసిందే. కాగా ఇండిగో సంక్షోభం ఎదుర్కోవడంతో కొన్ని వేల మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు నేటికీ వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ ఇండిగో విమానాల సమస్యనే చర్చనీయాంశంగా ఉంది. ఈ తరుణంలోనే పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అంటూ రామ్మోహన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
Read also : Murder Case: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Read also : Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ వాయిదా.. క్లారిటీ





