
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ :- భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అంతర్జాతీయ నేరగాడు సలీమ్ పిస్టల్ ను ఢిల్లీ పోలీసులు నేపాల్‌లో అరెస్ట్ చేశారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మరియు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో సలీమ్‌కు నేర సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.సలీమ్ పిస్టల్ భారత్‌కు అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తూ అనేక ఉగ్రపథకాలకు మద్దతు ఇస్తున్నాడు. అతడు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన క్రిమినల్ మరియు టెర్రరిస్ట్ ఆపరేషన్లకు కీలక మద్దతుదారుడిగా గుర్తించబడ్డాడు.
Read also : నాగబాబు మంత్రి పదవికి పవన్ బ్రేక్!కారణం ఏంటో తెలిస్తే షాకే..
నేపాల్‌లోని రహస్య స్థావరంలో అతడిని గుర్తించిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం, స్థానిక భద్రతా సిబ్బంది సహకారంతో అరెస్ట్ చేసి భారత్‌కు తరలించే ప్రక్రియ మొదలుపెట్టింది. సలీమ్ పిస్టల్ అరెస్టుతో పాక్ ఐఎస్ఐ, దావూద్ గ్యాంగ్ మరియు భారత్‌లోని ఆయుధాల అక్రమ రవాణా ముఠాలపై మరిన్ని కీలక సమాచారాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
Read also : రాఖీ పండుగ వేళ బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సు చార్జీలు డబుల్