అంతర్జాతీయం

స్విస్ బ్యాంకుల్లో భారతీయ సొమ్ము అక్షరాలు రూ. 37 వేల కోట్లు!

Swiss Banks: భారతీయుల సొమ్ము స్విస్ బ్యాంకుల్లో కోట్లకు కోట్లు పెరుగుతోంది. గత ఏడాదిలో ఏకంగా రూ. 37,600 కోట్లకు చేరినట్లు తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. స్థానిక బ్యాంకులే కాదు, ఇతర ఆర్థిక సంస్థలోకి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి. 2023లో స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ డబ్బు 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు పడిపోగా, 2024లో ఏకంగా 2.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు పెరిగినట్లు తెలిపారు.

భారతీయు డిపాజిట్లు రూ.36 వేల కోట్లు

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల అకౌంట్లలో డిపాజిట్లు దాదాపు రూ. 3,675 కోట్లు ఉన్నాయి. గతంతో పోల్చితే ఏకంగా 11 శాతం నిధులు పెరిగాయి. అక్కడి బ్యాంకుల్లో ఉన్న మొత్త మనదేశంలో భారతీయుల సొమ్ములో 10 శాతానికి సమానంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం 2006 నుంచి భారీగా పెరుగుతూ వచ్చింది. 2006లో అత్యధికంగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ గా రికార్టుకెక్కింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. దానికి కారణం సమాచార మార్పిడి ఒప్పందం. 2007లో చివరిగా గరిష్ఠంగా రూ.9,000 కోట్లకు పైగా నగదు నిల్వలు ఉన్నాయి.

ఇంతకీ ఏంటీ సమాచార మార్పిడి ఒప్పందం

ఇక 2018 నుంచి భారత్‌, స్విట్జర్లాండ్‌ మధ్య పన్ను సంబంధిత విషయాల్లో పరస్పరసమాచార మార్పిడి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయులందరి ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ భారతీయులకు చెప్పాల్సి ఉంటుంది.

Read Also: ఇండో-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, అసలు విషయం చెప్పిన ట్రంప్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button