
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రాన్నే కాకుండా భారత్ ను కూడా ఉన్నతమైన స్థానాల్లో నిలిపేందుకు సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలో భారత్ ఉన్నతమైన స్థానానికి ఎగబాకడానికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నేడు తిరుపతిలో నిర్వహించినటువంటి భారతీయ విజ్ఞాన సమ్మేళనం అనే కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ 2038 సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశంలో నాలెడ్జ్ కు కొదవలేదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుంది అని… ఇందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు అని అన్నారు. గతంలో హైదరాబాదులో నేను ఐటీ ని చాలా ప్రోత్సహించాను అని… తద్వారానే నేడు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు వచ్చింది అని చంద్రబాబు నాయుడు అన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందువు ఐక్యమత్యంతో ముందడుగు వేయాలి అని సూచించారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డం గురు సృష్టించిన చంద్రబాబు నాయుడు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. 2047 నాటికల్లా ఏపీని కూడా దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.
Read also : సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హరీష్ రావు?
Read also : మనుస్మృతి దహనం ఒక ఐక్యతకు నిదర్శనం : పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్





