Saturday, March 28, 2026
HomeజాతీయంK4 Missile Test: రక్షణ వ్యవస్థలో మరో మైలురాయి, ఖండాంతర కె-4 క్షిపణి ప్రయోగం సక్సెస్‌!

K4 Missile Test: రక్షణ వ్యవస్థలో మరో మైలురాయి, ఖండాంతర కె-4 క్షిపణి ప్రయోగం సక్సెస్‌!

వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మనదేశం కీలక క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణు సామర్థ్య జలాంతర్గామి నుంచి బంగాళాఖాతంలో మధ్యస్థ స్థాయి ఖండాంతర క్షిపణిని పరీక్షించి మన అణు శక్తిని ప్రపంచానికి చాటింది. విశాఖపట్నం తీరంలో ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ జలాంతర్గామి నుంచి కె-4 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన ఈ క్షిపణితో భారత్‌ సముద్ర ఆధార అణు శక్తికి మరింత బలం చేకూరనుంది.

కె-4 క్షిపణులు కీలక పాత్ర

కె-4 జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖంతాంతర క్షిపణి (ఎస్‌ఎల్‌బీఎం)తో భూ ఉపరితలం, గగనతలం, సముద్రగర్భం నుంచి అణు దాడుల సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్‌ చేరింది. మూడు రకాలుగా రహస్య దాడులు చేసే మన దేశ అణ్వాయుధ త్రయంలో కె-4 క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి. అణు దాడుల నిరోధక గస్తీ కోసం సముద్రంలో రహస్యంగా, నిశ్శబ్దంగా సుదీర్ఘకాలం పాటు సంచరించే అరిహంత్‌ తరగతి జలాంతర్గాముల కోసం వీటిని రూపొందించారు. భూ ఉపరితం నుంచి దాడులు చేసే అగ్ని-3 క్షిపణి నుంచి దేశంలోనే అత్యధిక దూరంలోని లక్ష్యాలను ఛేదించే సముద్ర ఆధార కె-4 క్షిపణిని అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి 2.5 టన్నుల అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.

కె-4 అంటే ఏంటి?  

మధ్యస్థ స్థాయి, ఘన ఇంధన జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణి కె-4. ఈ క్షిపణుల సిరీస్లో ‘కె’ అనే అక్షరాన్ని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ స్మృతి కోసం పెట్టారు. దీనిని డీఆర్‌డీవో అభివృద్ధి చేయగా, క్షిపణులను భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) తయారు చేస్తోంది. ఈ క్షిపణిని అరిహంత్‌ తరగతి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌, ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ వంటి జలాంతర్గాముల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఈ క్షిపణితో సముద్రంలో మన యుద్ధ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. అంతకుముందు 700 కి.మీ పరిధి మాత్రమేగల కె-15 (సాగరిక)పైనే ఆధార పడేవారు. 10 నుంచి 12 మీటర్లు పొడవుండే కె-4 క్షిపణి 17 నుంచి 20 టన్నుల వరకు బరువు ఉంటుంది. రెండు దశల స్థిర రాకెట్‌ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ క్షిపణి నావిగేషన్‌ కోసం జీఎన్‌ఎ్‌సఎ్‌సతో పాటు నావిక్‌పై ఆధారపడుతుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments