
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:-ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య మూడు వన్డేల సీరిస్ మ్యాచ్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వరుసగా రెండు వన్డేల మ్యాచులు భారత్ ఘోర పరాజయాన్ని పొందింది. పెర్త్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. అనంతరము నిన్న జరిగినటువంటి రెండవ మ్యాచ్ లోను భారత్ చివరి దశలో ఓడిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : కర్నూలు బస్సు దగ్ధం ఘటన… పూర్తి వివరాలు ఇవే..!
ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయంటూ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. రెండు వన్డే మ్యాచ్లలో టీమిండియా వరుసగా ఓడిపోవడానికి ప్రధాన కారణం మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ ను ఆడించకపోవడమే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మిడిల్ ఓవర్లలో మన బౌలర్లు ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. ఆస్ట్రేలియా తరఫున ప్రధాన స్పిన్నర్ అయినటువంటి జంపా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో కూల్దీప్ యాదవ్ ను తీసుకొని ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమని చాలా మంది సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కన్న నితీష్ కుమార్ రెడ్డిని ఆడించి ఉండాల్సింది అని అంటున్నారు. ఒకవైపు కోచ్ గంభీర్ నిర్ణయాలు విఫలమవడం… మరో వైపు కొత్త కెప్టెన్ గిల్ వన్డే మ్యాచ్లలో అనుభవం లేకపోవడం కారణంగానే టీమిండియా వరసగా రెండు వన్డేల మ్యాచులలో ఓడిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రెండు వన్డే మ్యాచ్లలో విరాట్ కోహ్లీ డక్ అవుట్ అవ్వడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ వర్షాలు..





