అంతర్జాతీయం

భారత్‌-యూకే మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌, చారిత్రాత్మక రోజుగా అభివర్ణించిన మోడీ!

Free Trade Agreement: భారత్-యూకే మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ప్రధాని మోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్యశాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.రెండు రోజుల పర్యటన కోసం లండన్ వెళ్లిన ప్రధాని, కీర్ స్టార్మర్‌ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ట్రేడ్‌ డీల్‌ కుదిరింది.

రెండు దేశాల మధ్య 120 బిలియన్ డాలర్ల వాణిజ్యం  

భారత్‌-యూకే మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన గత కొద్ది నెలలుగా చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి. 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచేలా ఈ ఒప్పందం సహకరించనుంది. లెదర్, ఫుట్ వేర్, దుస్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ ఒప్పందంలో రావారు. AI, సైబర్‌ సెక్యూరిటీ సహా పలు అంశాలను ఇందులో పొందుపరిచారు.  బ్రిటన్‌కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. దుస్తులు, వ్యవసాయరంగ, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు టారిఫ్‌ను లండన్‌ పూర్తిగా మినహాయించనుంది.

ప్రధాని మోడీ ఏమన్నారంటే?

అటు ఈ డీల్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో డీల్ చాలా దోహదపడుతుందన్నారు. ప్రజలకు శ్రేయస్సు, ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రపంచ పురోగతికి బలమైన భారత్- యూకే స్నేహం చాలా అవసరమని తెలిపారు. బ్రిటన్‌, భారత్‌ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇరుదేశాల మధ్య ఉపాధి కల్పన అవకాశాలు విస్తృతం అవుతాయన్న ప్రధాని.. భారత్‌-బ్రిటన్‌ భాగస్వామ్యంలో విజన్‌-2035 లక్ష్యంగా సాగుతున్నట్లు మోడీ తెలిపారు.

Read Also: లండన్ కు చేరిన ప్రధాని మోడీ.. కీలక అంశాపై ద్వైపాక్షిక చర్చలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button