
మాదాపూర్, క్రైమ్ మిర్రర్:- నీట్ కోచింగ్ కొరకు హస్టల్ కు వచ్చిన విద్యార్థిపై హాస్టల్ యాజమాని అసభ్యంగా ప్రవర్తించడంతో బందువులు చితకబాదారు. ఈ సంఘటన శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం … గత నెల 13వ తేదీన షేక్ పేట్లో నివాసం ఉంటున్న ఓ మైనర్ విద్యార్థి నీట్ కోచింగ్ కొరకు వచ్చి మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీకి చెందిన ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది. అప్పటి నుండి హస్టల్ యాజమాని సత్యప్రకాష్ ఆ విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. గత 10 రోజుల కిత్రం విద్యార్థి తల్లి కూతురు వద్దకు రావడంతో ఆమె కూతురు కలతచెందినట్లు కనిపించింది. దీంతో ఎంత అడిగిన సరిగా చెప్పలేదు. ఆమె తల్లి ఇంటికి వెళ్ళి కుటుంబ సబ్యులతో ఫోన్లో మాట్లాడించడంతో ఏం జరిగిందని నిలదీసి అడగగా హస్టల్ యాజమాని సత్య ప్రకాష్ నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. నాతో బయటకు రా అంటు వేదిస్తున్నాడంటు ఏడుస్తు చెప్పింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు తన బందువులతో వచ్చి హాస్టల్పై దాడి చేసి సత్య ప్రకాష్ ను చితకబాదారు. దీంతో విద్యార్థి తల్లి, తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల భారీ స్కామ్.. ఆరుగురు నిందితులు అరెస్టు!
Read also : ఏపీలో ఉచిత బస్సు.. మరి మా పరిస్థితి ఏంటి అంటున్న పురుషులు?