
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- హీరోయిన్ నిధి అగర్వాల్ మరియు ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి “రాజాసాబ్” సినిమాలోని సెకండ్ సాంగ్ లాంచ్ కు హీరోయిన్ నిధి అగర్వాల్ హైదరాబాదులోని KPHB లులు మాలులో జరుగుతున్నటువంటి ఈవెంట్ కు హాజరయ్యారు. ఈవెంట్ మొత్తం కూడా పూర్తయిన అనంతరం హీరోయిన్ నిధి అగర్వాల్ తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున గుమి గూడడం అలాగే హీరోయిన్ ను అసభ్యకరంగా తాగడం ఇవన్నీ టక టక జరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు ఈ ఘటనకు జరగడానికి గల కారకులైన వ్యక్తులపై కేసులను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణలోపంపై, లులు మాల్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా అభిమానులు నిధి అగర్వాల్ తో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించిన సందర్భంలో ఆమె కాస్త సహనానికి గురయ్యారు.. దీంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి విచారణ అనేది చేయనున్నారు. కాగా ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి వీఐపీ పర్సన్స్ అలాగే హీరోయిన్లు ఒకటికి రెండుసార్లు ఈవెంట్లకు వెళ్లాలంటేనే ఆలోచించే పనిలో పడ్డారు. ఈవెంట్ ఆర్గనైజర్లు అలాగే మాల్స్ యజమానులు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అని.. ఈ ఘటనతో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవ్వాలి అని మరోసారి ఇలా జరగకుండా ఈవెంట్ ఆర్గనైజర్లు అలాగే మాల్స్ యజమానులు పలు చర్యలు తీసుకోవాలి అని పోలీసులు వారికి విజ్ఞప్తి చేశారు.
Read also : ఇలా చేస్తే పేద ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాలి : వైఎస్ జగన్
Read also : ZPTC, MPTC ఎన్నికలపై సీఎం రేవంత్ క్లారిటీ





