Friday, March 20, 2026
Homeతెలంగాణఎడతెరిపిలేని భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ జగన్

ఎడతెరిపిలేని భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలి : ఎస్ఐ జగన్

సంస్థాన్ నారాయణపురం,క్రైమ్ మిర్రర్ :- భారీ వర్షాల కారణంగా ప్రజల,పౌరుల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎస్ ఐ జె. జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శిధిలమైన భవనాలలో ఉండవద్దని అన్నారు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మ్ మోటర్లు, స్తంభాలను తాకవద్దని ప్రజలకు, రైతులకు సూచించారు.వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున,చిన్నారులను,వృద్ధులను, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు అని అన్నారు. వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసు వారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలరని మనవి చేశారు.

Read also : భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కోదాడ సీఐ

Read also : మెంథా తుఫాన్ ప్రభావం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments