
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- దాసర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలెత్తిన సమస్యలను మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి లబ్ధిదారులు వివరించారు. కందుకూరు మండలం నుంచి పలువురు మహిళా లబ్ధిదారులు.. మార్కెట్ కమిటీ డైరెక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో తుక్కుగూడ కార్యాలయంలో కేఎల్ఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులు,అర్హులైన పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో ప్రజాప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.గత వైఎస్ ప్రభుత్వంలో కట్టుకుని మధ్యలో ఆగిపోయిన ఇండ్లు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఆగిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను కిచ్చెన్న కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని లబ్ధిదారులు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇళ్లకు నోచుకోలేదని వాపోయారు. ఆగిన బిల్లులను వెంటనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేఎల్ఆర్ హామీ ఇచ్చినట్లు ఇందిరమ్మ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
Read also : గ్రామాన్నే శోక సంద్రంలోకి ముంచేసిన ఘటన.. ఆరుగురు చిన్నారులు మృతి!
Read also : దీనస్థితిలో ఉన్న మరో కమెడియన్.. ఇతనైనా కోలుకోగలడా?