
అమరావతి బ్యూరో,క్రైమ్ మిర్రర్ :- ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన ఘటన మానవత్వానికే మచ్చ తెచ్చింది. భర్తతో పాటు భర్త అన్నతోనూ కాపురం చేయాలని అత్తమామలు ఒత్తిడి చేయడంతో ఓ యువతి మానసికంగా కుంగిపోయి చివరికి పోలీసుల ఆశ్రయానికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే… జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రంజిత్ కుమార్ పోలవరానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రంజిత్ అన్నకు పిల్లలు లేకపోవడంతో, అత్తమామలు ఆశ్చర్యకరంగా ఇద్దరికీ కాపురం చేయి అంటూ యువతిపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే దానికి అంగీకరించనందుకు యువతిని ఇంట్లో గదిలో బంధించి, శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే స్పందించి రంజిత్, అతని తల్లిదండ్రులు, అన్నను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై స్థానికులు, మహిళా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి అసహజ ఆచారాలు సమాజానికి చెడు ఉదాహరణ. బాధితురాలికి న్యాయం జరిగేలా నిందితులకు కఠిన శిక్ష విధించాలి, అని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత యువతికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి, రక్షణ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read also : యాదాద్రి ఇంచార్జి ఎస్ఈ రామారావు అవినీతి చిట్టా.!
Read also : ఛీ… ఛీ… మనిషేనా?.. మైనర్ బాలికను రూ.10 లక్షలకు అమ్మేసిన కన్నతల్లి!





