మందుబాబులకు పెద్ద షాక్. దేశంలో మద్యం ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం. యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై మాత్రమే కాక, భారతదేశంలో మద్యం పరిశ్రమపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడడంతో మద్యం తయారీలో వాడే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
గ్యాస్ కొరత, ప్రత్యేకించి కమర్షియల్ గ్యాస్ పట్ల ఎటువంటి స్థిరత్వం లేకపోవడం వల్ల గాజు బాటిళ్ల తయారీ పరిశ్రమ తీవ్ర దెబ్బతింటోంది. గాజు బాటిళ్ల ధరలు ఇప్పటికే 15 నుంచి 20 శాతం పెరిగాయి. ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చోప్రా స్పష్టం చేసినట్లుగా, ఈ కారణంగానే మద్యం ధరలు కూడా పెరుగుతాయని మార్కెట్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాక, యుద్ధ ప్రభావం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరుగాయి. బీర్ల కాన్ల తయారీలో వాడే అల్యూమినియం ధరలు 15 శాతం పెరిగాయి. కంపెనీలు అదనపు ఖర్చులను కవర్ చేయడానికి మద్యం ధరలను పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ పరిస్థితి త్వరలోనే వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపబోతోందని సూచన ఉంది.
ఇక వేసవిలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతూ, ఉష్ణోగ్రతలు రికార్డులా మిగిలిపోతున్నాయి. గ్యాస్ సరఫరా సమస్య కొనసాగితే గాజు ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాక, బీర్ల డిమాండ్ పెరుగుతున్న వేళ సరఫరా తగ్గడం వల్ల బియర్స్ కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీని ఫలితంగా త్వరలో మద్యం ప్రేమికులు భారీ ధరలకు సిద్దం కావాల్సి ఉంటుంది. పరిశ్రమ వర్గాలు అందిస్తున్న అంచనాల ప్రకారం, మద్యం ధరలు గణనీయంగా పెరుగుతాయని సూచిస్తున్నారు.
