
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతూ పోతున్నాయి. దీని ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది తారస్థాయిలో ఉంది. ఉదయం పూట ప్రయాణించేటువంటి వాహనదారులు అలాగే కూలీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ IMD అధికారులు మరో కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే మరో రెండు మూడు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయి అని వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలలో తీవ్ర చలిగాలులు వీస్తాయి అని ఏడు జిల్లాల వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన 7 జిల్లాలు
1. అదిలాబాద్
2. అసిఫాబాద్
3. నిర్మల్
4. మంచిర్యాల
5. సంగారెడ్డి
6. మెదక్
7. కామారెడ్డి
హైదరాబాద్ IMD వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడు జిల్లాలలో రాబోయే రెండు,మూడు రోజులు పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తాయి అని ప్రకటించింది. ఇక నిన్న అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాగా అసిఫాబాద్ నిలిచింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నిన్న 20 జిల్లాలలో సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చాలామంది వాహనదారులతోపాటు వ్యవసాయ రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ చలికాలంలో వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : రాత్రి వేళల్లో అధిక మూత్రం వస్తుందా.. అయితే ఈ డేంజర్ సమస్య ఉన్నట్లే?
Read also : ఘోర పరాజయంతో చెత్త రికార్డును మూటగట్టుకున్న సౌత్ ఆఫ్రికా?





