
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కేవలం అక్రమ సంబంధం మూలంగానే గత రెండు ఏళ్లలో ఎంతోమంది మరణించిన సందర్భాలు నిత్యం వార్తలలోనూ లేదా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కొన్నిచోట్ల భర్త వేరే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోగా మరికొన్ని చోట్ల భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటి మూలంగాన ఎంతోమంది భార్య భర్తలు విడిపోగా… వారి బిడ్డలు మాత్రం అనాధలవుతున్నారు. కేవలం ఇవాళ ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఘటనలు వెలుగు చూశాయి. హైదరాబాదులోని కూకట్పల్లిలో ప్రసన్న భర్త మెడకు చున్ని బిగించి చంపి వేయగా మరోవైపు గుంటూరు జిల్లా చిలువూరులో భార్య లక్ష్మీ భర్తను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. శరీరం సుఖం కోసం రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. ఇక ఇప్పటి రోజుల్లో ప్రతిరోజు కూడా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం ఐదు అక్రమ సంబంధాలు వార్తలు వెలుగు చూస్తున్నాయి. మరి దేశ వ్యాప్తంగా ఇంకెన్ని అక్రమ సంబంధాలు వెలుగు చూశాయో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇక నుంచి అయినా కాస్త ఆలోచనతో ముందుకు వెళ్లాలి అని.. మీరు తప్పు చేయడం వల్ల పిల్లలు అనాథలు అవుతారు అని గుర్తుంచుకోవాలి. ఈ అక్రమ సంబంధాలపై పోలీసు అధికారులు ఎన్ని రకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా పరిస్థితులు మారడం లేదు.
Read also : Scorpio: ఈరోజు వీరికి బాగా డబ్బులు
Read also : డిప్యూటీ సీఎంను “సీఎం.. సీఎం” అంటూ కేరింతలు పెట్టిన యువత?





