
-అనేక సార్లు పేపర్లలో కథనాలు వచ్చినప్పటికీ చర్యలు శూన్యం
-అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
-ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ రవాణా బీభత్సం
-హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ భయపడని మాఫియా
పొలాలకు వెళ్లే దారులు శిథిలం
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి:- ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ ఇసుక, మట్టి రవాణా చేస్తూ పొలాలకు వెళ్లే దారులు చిత్తడి చేస్తున్నారు అక్రమదారులు. అయినా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు మండల రెవెన్యూ, మైనింగ్ అధికారులు. అనేకసార్లు పేపర్లలో కథనాలు వచ్చినప్పటికీ కూడా అక్రమార్కులపై ఎలాంటి చర్యలకు పాల్పడని అధికారులు…. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో అక్రమ ఇసుక మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ రవాణా చేస్తూ పొలానికి వెళ్లే దారులు చిత్తడి చేస్తున్నారని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 5 నుంచి 10 ట్రాక్టర్లు రేయి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా నడుపుతూ పొలాలకు వెళ్లే దారులు మట్టి కొండలుగా మారి రైతులు నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. దారి వెంట పొలానికి వేసుకున్న నీటి పైపులు ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో ధ్వంసం అయ్యి తీవ్రంగా నష్టపోతున్న నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మాఫియాకు అధికారుల అండదండలు ఉండడం వల్లనే వారు ఇష్టం వచ్చినట్లుగా దండ కొనసాగిస్తున్నారని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“మా ప్రాణాలకు విలువ లేదా..? మాఫియాగాలకే ప్రభుత్వం భరోసా.?” అంటూ ఆమనగల్లు రైతులు మండిపడుతున్నారు. మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మేము అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇసుక,మట్టి బకాసురులపై చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుకుంటున్నారు.
Read also : వాళ్లంతా శాంతించే వరకు పవన్ కళ్యాణ్ కు జ్వరం తగ్గదులే : యాంకర్ శ్యామల