
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మరింత బలహీనపడుతుంది అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరును గనుక చూస్తే ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిజెపికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో బయట తిరగలేకపోయారని ప్రశ్నించారు. ఇలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో 50 ఏళ్లు వరకు కూడా తెలంగాణలో అధికారం చేపట్టలేదు అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా ఓటు వేయాలని ఎందుకు మీరు చెప్పలేదంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలు ఎన్నోసార్లు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని గ్రామాలకు వెళ్లి మరి ఓట్లు అడిగినప్పుడు మీరు ఎందుకు మా పార్టీకి ఓటు వేయండి అని అడగలేదు అంటూనే… ఇతర పార్టీ నేతలను చూసి నేర్చుకోండి అంటూ బీజేపీ నాయకులకు ఒక వీడియో సన్నివేశం ద్వారా తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ మిల్లిమెల్లిగా చనిపోతుంది అంటా… కిషన్ రెడ్డి గారు దయచేసి బీజేపీ పార్టీని కాపాడండి అంటూ తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వీడియోని విడుదల చేసి హైలెట్ గా నిలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియో పై ప్రతి ఒక్క బీజేపీ పార్టీ నాయకుడితో పాటు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా తెలంగాణలో చాలా బలంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం వాటి దరిదాపుల్లోకి రాలేకపోతుంది.
Read also : పార్టీ పరంగా రిజర్వేషన్లు.. రేపే క్యాబినెట్ లో నిర్ణయం?
Read also : కెప్టెన్ కు తీవ్ర గాయం.. ఐసీయూలో చికిత్స నిజమేనా?





