
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆస్ట్రేలియా తో జరిగినా 3 వన్డేల సిరీస్ లో భారత్ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ ఓడిపోయిన కూడా భారత అభిమానులు అంతగా దిగులు చెందడం లేదు. ఎందుకంటే.. మూడవ వన్డేలో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల పర్ఫామెన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఒకవైపు రెండుసార్లు డక్కువుటైన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మూడవ వన్డేలో హాఫ్ సెంచరీతో జట్టు విజయానికి కీలకమైతే మరో వైపు నుంచి సూపర్ సెంచరీ తో రోహిత్ శర్మ దూకుడును కనబరిచారు. దీంతో సునాయసంగా మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ ఓడిపోయిన కూడా ఎక్కడ బాధ లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి నిలబడితే భారత్కు ఇక ఏ సిరీస్ లోను ఎదురులేదని మరోసారి నిరూపించారు. ఒక సగటు భారతీయుడిగా క్రికెట్ అభిమాని కోరుకునేది ఇంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు.
Read also : టీఆర్పీల కోసం చిరంజీవి పేరు, ఫోటోలు ఉపయోగిస్తే కఠిన చర్యలు?
చాలా రోజుల తర్వాత వీరిద్దరూ వన్డే ఫార్మాట్ కు జోడిగా నిలబడి ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యం చేశారు అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇద్దరూ ఒకటి అయి భారత్ ను సునాయసంగా గెలిపించారు. ఇద్దరూ ఫోర్లు, సిక్సులు కొడుతుంటే భారత అభిమానులకు జోష్ అందుకుంటుంది. అప్పటిలాంటి దూకుడు, అప్పటిలాగే ఫైర్ ఇస్తున్నారు అని… వారి జోడి ఇలానే కొనసాగుతూ ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అలాంటోళ్లు 2027 ఓడి వరల్డ్ కప్పులో జోడిగా అడుగుపెడితే మాత్రం వరల్డ్ కప్ మనదే అని ఫ్యాన్స్ అందరూ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వీరిద్దరూ వన్డే వరల్డ్ కప్ లో భాగం అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కోరుతున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు అయినా సరే వీరిద్దరిని 2027 వన్డే వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయాలనీ బీసీసీఐపై ఇప్పటికే ప్రెషర్ కూడా చేస్తున్నారు. దీంతో మళ్లీ తెరపైకి రోహిత్ శర్మ, కోహ్లీ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి.
Read also : టీఆర్పీల కోసం చిరంజీవి పేరు, ఫోటోలు ఉపయోగిస్తే కఠిన చర్యలు?





