
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలో వ్యాప్తంగా ఎన్నో రకాలుగా సైబర్ నేరాలు అలాగే హ్యాకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాము. అయితే ఇదే సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాలు మరియు హ్యాకింగ్స్ గురవుతున్న నేపథ్యంలో పాస్వర్డ్ లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని టేక్ నిపుణులు సూచిస్తున్నారు. బలమైన పాస్వర్డ్ లను పెట్టుకోవాలి అని.. లేదంటే ఈజీగా హ్యాక్ ఇటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా పాస్వర్డ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ 123,1234,123456789,0000,india@123 వంటి సులభమైన పాస్వర్డ్లు పెట్టుకోవడం వల్ల ఈజీగా సిస్టం హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఇలాంటి పాస్వర్డ్లు ఇప్పటివరకు మన దేశవ్యాప్తంగా 76 లక్షల మంది ఉపయోగించారు అని రీసెర్చరులు చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బలమైన పాస్వర్డ్లను పెట్టాలి అని సూచిస్తున్నారు. అప్పర్ కేసు మరియు లోయర్ కేసు లెటర్స్, నెంబర్స్ మరియు సింబల్స్ కాంబోలో ఉన్నటువంటి పాస్వర్డ్ ను సెట్ చేసుకోవాలి అని తెలిపారు. ఫోన్ నెంబర్లు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లు, బర్త్డే డేట్లు వంటివి పెట్టుకోకూడదు అని.. వాటిని హ్యాకర్లు సులభంగా ట్యాప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
Read also : మత్తు పదార్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించిన రూరల్ ఎస్ఐ
Read also : ఓటుకు కాంగ్రెస్ 5000 , బీఆర్ఎస్ 7000.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?





