క్రీడలు

ప్లే ఆప్స్ కి వెళ్లాలంటే… విజృంభించాల్సిందే!… లేదంటే చాలా కష్టం?

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా ఇప్పటికే సగం మ్యాచెస్ జరిగాయి. మొదట్లో ఈ సంవత్సరంలో అన్ని అన్ని జట్లు కూడా చాలా బలంగా కనిపించాయి. కానీ గత సంవత్సరంలో విజృంభించి ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఈసారి ఘోరంగా విఫలమయ్యింది. గత సీజన్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న జట్టు ఈ సంవత్సరం మాత్రం దానికి భిన్నంగా పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగడంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ జట్టు కేవలం రెండిట్లో మాత్రమే గెలుపును నమోదు చేసుకుంది. ఇక మరో ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి ప్లే ఆఫ్స్ చేరాలి అంటే కచ్చితంగా ఏడు మ్యాచ్లలో 6 మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది. ఏడు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు ఓడిపోయినా సరే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ జట్టు ఇంటి బాట పట్టడం ఖాయం.

ఇక ఈసారి గుజరాత్ ప్రస్తుతం ఏడు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్, నాలుగో స్థానంలో, ఆర్ సి బి ఐదు, లక్నో ఆరవ స్థానంలో ఉన్నాయి. ఇక కోల్కత్తా మరియు ముంబై జట్లు ఇప్పుడిప్పుడే గెలుపును నమోదు చేస్తూ వస్తున్నాయి. ఇక్కడ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఖచ్చితంగా మరో ఏడు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు గెలవాల్సి ఉంది. లేదంటే కచ్చితంగా ఇంటి బాటపడుతుంది. దీంతో ఎలాగైనా సరే అభిమానులు మాత్రం జట్టు ప్లే ఆప్స్కు చేరాలని పూజలు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరంలో కాటేరమ్మ కొడుకులుగా పేరుపొందిన హెడ్, అభిషేక్ శర్మ మరియు నితీష్ కుమార్ రెడ్డిలు మాత్రం ఈసారి ఘోరంగా విఫలమవడంతో కాటేరమ్మ కొడుకులకు ఏమైంది అని అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button