
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేస్తున్న పాలనలో న్యాయం, ధర్మం రెండూ కూడా కనిపించడం లేదని జగన్ చెప్పుకొచ్చారు. పాలన గురించి అధికారులను ప్రశ్నిస్తే చాలు వెంటనే జైల్లో పెడుతున్నారని చంద్రబాబు నాయుడు పై జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా చంద్రబాబు పాలన గురించి అలాగే కార్యకర్తలపై పెడుతున్న కేసుల గురించి వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చించారు. మన కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడితే బాధితులు తరుపున మీరు అండగా ఉండాలని లీగల్ సెల్ ప్రతినిధులకు సూచనలు చేశారు.
Read also : గుర్తుండిపోయే విజయం.. గౌతమ్ గంభీర్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్!
ప్రతి ఒక్క కార్యకర్తకు మీరు అండగా ఉండాలని సూచించారు. మీ సేవలు ఎప్పుడూ కూడా పార్టీ మర్చిపోదు అని లీగల్ సెల్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు … కోరుకోనిదే దేవుడు కూడా వరం ఇవ్వడు అని… అలాగే లాయర్లు వాదించనిదే న్యాయం దక్కదు అని వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. కాగా వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం చాలానే కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తుంది. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో నేడు భేటీ అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు అలాగే వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కార్యకర్తలకు అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు.
Read also : పోలీస్ స్టేషన్‌లోనే అక్రమ దందా – ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్వాకం