
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్,పాకిస్తాన్ బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరుపుతోంది.మే 7న అర్థరాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు చనిపోయారు. మే 8న అమృత్ సర్ ను టార్గెట్ చేసిన పాక్ .. మిసైల్ తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అమృత్ సర్ పరిసర ప్రాంతాల్లో మిసైల్ శకలాలు లభ్యమయ్యాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
అటు పాకిస్థాన్ బార్డర్ లోని రాజస్తాన్, పంజాబ్ బార్డర్ లను మూసివేశారు. రాజస్థాన్,పంజాబ్ లలో బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు.సరిహద్దులో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కాల్చివేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.పాకిస్తాన్‌తో 1,037 కి.మీ సరిహద్దును పంచుకునే రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నామని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సరిహద్దు భద్రతా దళ సిబ్బందికి కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు.
జోధ్‌పూర్, కిషన్‌గఢ్ , బికనీర్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను మే 9 వరకు నిలిపివేశారు. సుఖోయ్-30 ఎంకేఐ జెట్‌లు గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్ , బార్మర్ జిల్లాల్లోని పాఠశాలలు మూసివేయబడ్డాయి, పరీక్షలు వాయిదా వేయబడ్డాయి. పోలీసులు ,రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు.
పంజాబ్‌లో, అన్ని పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశారు. బహిరంగ సభలపై ఆంక్షలు విధించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.
హైదరాబాద్ ను పాకిస్తాన్ టార్గెట్ చేస్తుందా?.. అంటే అవుననే చెప్పాలి!.. ఎందుకంటే?