
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య కాంగ్రెస్ నేతలు అక్రమ ఓట్ల గురించి తీవ్రంగా ఆరోపిస్తున్నారని.. అసలు మళ్లీ పోటీ చేస్తే గెలిచే సత్తా వారికి ఉందా?.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. అంతేకాకుండా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచల వ్యాఖ్యలు చేశారు. దాదాపు నేను 30 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని అన్నారు. కొంతమంది వార్డు మెంబర్గా కూడా గెలవకుండా.. ఓట్ల గురించి, అక్రమ ఓట్ల గురించి అంటూ తెగ మాట్లాడేస్తున్నారు. కనీసం వార్డ్ మెంబర్గా గెలవని ఈ వ్యక్తులకు ఓట్ల గురించి ఎలా తెలుస్తుంది?.. అని మహేష్ గౌడ్ కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రోడ్లపైకి వస్తే ఎక్కడైనా సరే రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది అని.. కౌంటర్ వేశారు బండి సంజయ్.
Read also : రేపటి నుంచి 50 శాతం సుంకాలు, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!
కాగా తాజాగా కాంగ్రెస్ నేతలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓట్ల చోరీ జరిగింది అని.. కేవలం ఓట్ల చోరీ తోనే మోదీ కూడా అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ కీలక నేత మహేష్ గౌడ్ చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే కరీంనగర్లో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచినట్లు డౌట్ ఉందని మహేష్ గౌడ్ అందరి ముందు వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిణామంలో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు అని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పార్టీని నేతలు ఎవరూ కూడా పట్టించుకోవడంలేదని అన్నారు. మహేష్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలపై చాలామంది బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా బండి సంజయ్ మహేష్ గౌడ్ కు కౌంటర్ రూపంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also : నలుగురు మెప్పుకోసం.. అప్పులు చేయకండి : టెక్ ఉద్యోగి