
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన అనంతరం కేటీఆర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బాధ్యత తనది అని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాధారణంగా ఎన్నికలలో ఒకసారి గెలవచ్చు.. మరోసారి ఓడిపోవచ్చు.. ఎన్నికలంటేనే గెలుపోటములు సహజము అని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటాను అని.. ఏ కష్టం వచ్చినా వారిని వదిలే సమస్య లేదు అని అన్నారు. ఏ కార్యకర్తకు అయినా కష్టం వచ్చింది అని తెలిస్తే అర్థగంటలో అక్కడ వాలిపోతాను అని తాజాగా నేడు జరిగిన జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో భాగంగా మీడియా వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఫలితాలు నిన్న విడుదలైన సందర్భంలో ఆ ఫలితాలు చూసిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు తీవ్ర డిప్రెషన్ కు గురయ్యారు. ఈ సందర్భంలోనే కార్యకర్తలలో కొంచెం జోష్ నింపేలా కేటీఆర్ వ్యాఖ్యానించడం ప్రతి ఒక్కరి మనసు కూడా కాస్త కుదుటపడింది.
Read also : బీబీసీకి ట్రంప్ మరో షాక్
Read also : కష్టతరమైన శస్త్ర చికిత్సలను కూడా నా రోబో క్షణాల్లోనే చేస్తుంది : మస్క్





