
క్రైమ్ మిర్రర్, తమిళనాడు :- నటుడు, టీవీకి పార్టీ చీఫ్ విజయ్ సభలో నిన్న ఘోరమైన భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా అన్యం పుణ్యం తెలియని 39 మంది మృతి చెందారు. ఇందులో పెద్దలతో పాటుగా చిన్నారులు కూడా ఉండడం.. పురుషులకంటే మహిళలే ఎక్కువగా మరణించడం యావత్ దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం సృష్టిస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ కు ప్రతి ఒక్కరు వెయిట్ చేసే క్యూస్షన్ ను మీడియా అడిగేసింది. ఇంతమంది చనిపోయారు కదా విజయ్ ని మరి అరెస్ట్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా… విచారణ కమిషన్ నివేదిక ఆధారంగానే మా తదుపరి చర్యలు ఉంటాయని సీఎం స్టాలిన్ స్పష్టంగా వివరించారు. ఇక బయట జరిగే ఎటువంటి ఊహాగానాలన్నింటికీ నేను సమాధానం ఇవ్వలేనని స్టాలిన్ అన్నారు. ఈ ఘటనపై ఎక్కడా కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలను ఓదార్చడానికి తన దగ్గర ఎటువంటి మాటలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఘటన జరిగిన వెంటనే విజయ్ ఫ్లైట్ లో చెన్నై వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరూ గమనించాం. విజయ్ నిన్న కరూర్ లో జరిగినటువంటి సభకు 10000 మందికి మాత్రమే పరిమిషన్ ఇవ్వగా.. అక్కడకు ఏకంగా లక్షకు పైగా జనం వచ్చేసరికి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో భాగంగానే ఇప్పటికి దాదాపుగా 39 మంది మృతి చెందారు.
అసలేం జరిగిందంటే…
నిన్న రాత్రి 7 గంటలకు విజయ్ సభ వద్దకు రాగా ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికి జనంలో తొక్కిసలాట మొదలైంది. 7:15 కు అంబులెన్స్లు వచ్చాయి. 7 25 కు విజయ్ ప్రసంగాన్ని ముగించారు. ఇక ఎనిమిది గంటల వరకు ఆ ప్రాంతం మొత్తం కూడా ఖాళీ అయ్యింది. 9:45కు విజయ ఎయిర్పోర్టుకు చేరుకొని 11:55కి తన ఇంటికి చేరుకున్నారు. ఇది అక్కడ జరిగిన స్టోరీ మొత్తం. కాగా ఈ ఘటనలో ఎంతోమంది గాయాలు పాలయ్యారు. స్టేట్ సీఎం నుంచి దేశం పీఎం వరకు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
Read also : బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక : తహసిల్దార్ వీరాభాయ్