
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అయినటువంటి పీటర్సన్ నేడు రషీద్ ఖాన్ ను ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా పీటర్సన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు రషీద్ ఖాన్ ఆశ్చర్యపోయేటువంటి సమాధానాలు ఇచ్చారు. కాబుల్ వీధుల్లో మీరు నడుచుకొని వెళ్తారా?.. అని రషీద్ ఖాన్ ను పీటర్సన్ అడగగా వెంటనే లేదు నేను ఆ వీధుల్లో అలా ఒంటరిగా తిరగలేను. నాకు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది.. అందులోనే ఎక్కడికైనా బయటికి వెళ్లాలి అంటే వెళ్లి వస్తాను అని అన్నారు.
Read also : గొల్లపల్లి అధికారులారా ఇటు చూడండి.. గుంజపడుగు వేలే రోడ్డంతా చెత్తమయం!
అ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్లడం నా సేఫ్టీ కోసమే అని రషీద్ ఖాన్ చెప్పగానే పీటర్సన్ ఆశ్చర్యపోయారు. ఎందుకు అలా అని పీటర్సన్ అడగగా.. ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో నేను ఒంటరిగా తిరగలేను.. అలాగే నా సేఫ్టీని నేను క్రమబద్ధంగా నిర్వహిస్తానని.. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్తాను అని అన్నారు. దీంతో ఇది వింటున్నటువంటి పీటర్సన్ తో పాటు రషీద్ ఖాన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే రషీద్ ఖాన్ కి ఏమైనా శత్రువుల నుంచి ప్రాణహాని ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?.. అని ప్రతి ఒక్కరు కూడా సంధిస్తున్నారు. ఏది ఏమైనా కూడా తనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఉండడం అలాగే ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో ఎక్కడికి వెళ్లినా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్తాను అని రషీద్ ఖాన్ చెప్పడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
Read also : మానవత్వం ఉన్న వాళ్ళకి పదవి ఉండాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి





