
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎవరికివారు యమునా తీరే అంటూ మాటలు యుద్ధాలను కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి చెత్త నా కొడుకు అని కేటీఆర్ పై మండిపడ్డారు. మరోవైపు కేటీఆర్ కూడా మగతనం ఉంటే రా చూసుకుందాం అంటూ సవాలు విసిరారు. ఇక తాజాగా బండి సంజయ్ జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం టోపీ ధరించడం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్లుగా మారాయి. రోడ్ షోలో సీఎంతో పాటుగా అజహారుద్దీన్ మరియు ఎంఐఎం నేతలు టోపీ పెట్టుకోలేదు కానీ.. ఓట్ల కోసం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముస్లిం టోపీ పెట్టుకున్నారు. నేను హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిని.. మరో మతాన్ని కించపరచును. ఎప్పుడైనా సరే ఆ టోపీ పెట్టుకోవాల్సిన రోజు వస్తే నా తల అయిన నరుక్కుంట కానీ ఆ టోపీ మాత్రం పెట్టుకునే పరిస్థితి లేదు అని జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read also : యువతే కదా ఏం చేస్తారు అనుకోకండి.. తలచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి : వైయస్ జగన్
Read also : కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ అంట.. మరి హిందువులకు గౌరవం లేదా : కిషన్ రెడ్డి





