
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గురువారం బాన్సువాడ పట్టణంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డినీ కలిశానని,సీఎం దగ్గర నా స్వార్థం కోసం వెళ్లినట్టు నిరూపిస్తే,రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గనికి అడిగినన్ని నిధులు మంజూరు చేశారని,గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరమని అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్,వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్లా శ్రీధర్,బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ కలిక్,మాజీ ఎంపీపీ ఎజస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్ల రవీందర్,నార్ల సురేష్,నార్ల ఉదయ్,మోహన్ నాయక్,గోపాల్ రెడ్డి,ఎండి దావూద్,వహబ్,ఆఫ్రోజ్,ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Read also : రేవంత్ లాంటి బలహీనమైన CM ను నా రాజకీయ చరిత్రలోనే చూడలేదు : కేటీఆర్
Read also : రెండవసారి డక్ అవుట్ అయిన కోహ్లీ.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో రోహిత్..!