
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని చాలా రోజుల తర్వాత వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటుకీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మీడియాతో మాట్లాడుతూ ఇన్ని రోజులు రాజకీయంగా ఎందుకు బయటకు రాలేదు అనేది వివరించారు. నాకు ఈ మధ్యకాలంలో బైపాస్ సర్జరీ జరిగింది అని.. డాక్టర్లు పూర్తిస్థాయిలో రెస్టు తీసుకోవాలని సూచించడంతోనే ఇన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం.. బాలుడి ఆత్మహత్యే ప్రధాన కారణం?
ఇకపోతే రాజకీయాలకు ఎక్కడా కూడా దూరంగా ఉండబోనని.. 2029 ఎన్నికలలో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి నాకు శక్తి ఉన్నంతవరకు కృషి చేస్తూనే ఉంటానని… ఎక్కడా కూడా వెనుతిరిగే అవకాశం లేదు అని కొడాలి నాని అన్నారు. ఈ సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొని మరో ఆరు నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లోకి వస్తాను అని… ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదు అని కొడాలి నాని స్పష్టం చేశారు. కచ్చితంగా 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ని చేసుకోవడానికి ఈ సర్వశక్తుల మా నాయకులం పనిచేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రజలలో కలిసి తిరుగుతాను అని తెలిపారు.
Read also : మేము ముగ్గురం కలిసే ఏపీని అభివృద్ధి చేస్తాం : సీఎం చంద్రబాబు





