ఆంధ్ర ప్రదేశ్సినిమా

టాలీవుడ్ ఇండస్ట్రీనీ చూస్తుంటే చాలా అసూయగా ఉంది : విక్రమ్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఒకప్పుడు తెలుగు భాషన్న, తెలుగు సినిమాలన్నా మిగిలిన భాషల వాళ్ళు చాలా చులకన చేసే మాట్లాడే వాళ్ళని , కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అన్నారు. గత కొంతకాలంగా తెలుగు సినిమాల క్రేజ్ వేరే లెవెల్ లో పెరిగిపోయిందని… ఇప్పుడు టాలీవుడ్ ను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయని తెలిపారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, పుష్ప మరియు పుష్ప-2 సినిమాలే కాకుండా.. టాలీవుడ్ లోని చిన్న చిన్న సినిమాలు అయినటువంటి బలగం,మ్యాడ్, డీజే టిల్లు, ఈమధ్య వచ్చిన కోర్టు లాంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా రాబట్టాయి.

మొదటి మ్యాచ్ లోనే ఘన విజయం … కోహ్లీ మరో రికార్డు!

ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ పై తనకు అసూయగా ఉందని కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అన్నారు. తాజాగా విక్రమ్ నటించిన వీర ధీర శూర పార్ట్ 2 మార్చ్ 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్రమ్ పాల్గొని టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలుగులో చేస్తున్న సినిమాలు.. తమిళ సినిమా పరిశ్రమలో కూడా రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మంచి కంటెంట్ ఉంటే అది చిన్న కథ అయినా లేదా పాన్ ఇండియా మూవీ అయినా తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తారని అన్నారు. దీంతో చియాన్ విక్రమ్ పై టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెలుబడుతున్నాయి.

జులైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు – ఆ తర్వాత స్థానిక సంస్థలకు..!

చండూరులో జూనియర్ సివిల్ కోర్ట్ ఏర్పాటు చేయాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button