
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దిగ్గజ క్రికెటర్స్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆడతారా?.. లేదా?.. అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మెదడులో ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. 2027 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతారన్న గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను అని.. అది వారి ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుందని గంభీర్ స్పష్టత ఇచ్చారు. ఫిట్నెస్ తో పాటు స్థిరమైన ప్రదర్శన కనబరిస్తే ఖచ్చితంగా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. త్వరలో జరగబోయేటువంటి ఆస్ట్రేలియా సిరీస్ వీళ్ళిద్దరికీ కూడా చాలా కీలకమని అన్నారు. ఈ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తారని తాను అనుకుంటున్నానని చెప్పుకుచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆస్ట్రేలియా సిరీస్లో ఆడనున్నారని ఇప్పటికే తెలిసిపోయింది. ఇప్పటికే రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తూ ఆస్ట్రేలియా టూర్ కూ నేను సిద్ధమంటూ చెప్తున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ గురించి ఎటువంటి వార్తలు అయితే ఇంకా రాలేదు. అంతర్జాతీయ టెస్టులు మరియు టి20లకు వీడ్కోలు పలికినటువంటి వీళ్లిద్దరూ కూడా వన్డే ల్లో కొనసాగుతున్నారు. ఒకవైపు రోహిత్ శర్మ మరోవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆస్ట్రేలియా సిరీస్ లో బాగా రాణించాలని, అద్భుతమైన ప్రదర్శన కనబరిచాలని కోరుతున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి 2027 వరల్డ్ కప్పులో ఆడితే చూడాలని ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Read also : హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేమి!
Read also : టీడీపీ కి ఓటు వేస్తే అంతే గతి… వైరల్ అవుతున్న యువకుడి సెల్ఫీ వీడియో!