
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ” ట్రంప్ ఈజ్ డెడ్ ” అంటూ ప్రచారం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ వ్యాఖ్యలకు తాజాగా ట్రంప్ సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ ప్రతి ఒక్కటి కూడా వింటూనే ఉన్నానని, అవన్నీ కూడా అవాస్తవాలు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిజాన్ని చెప్పారు. తాజాగా వైట్ హౌస్ లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి రూమర్స్ ను ఎవరూ నమ్మవద్దని అన్నారు. నేను యాక్టివ్ గా ఉండడానికి ప్రతి రోజు కూడా గోల్ఫ్ ఆడుతానని.. దానివల్ల ప్రతిరోజు కూడా చాలా యాక్టివ్గా ఉంటాను అని వెల్లడించారు. కాగా ట్రంప్ మన భారత్ కు టారిఫ్స్ విధించిన తరువాత భారతీయులు ట్రంప్ పై మండిపడుతున్నారు.
Read also : సోషల్ మీడియాలో కొత్త నోట్ల నాణ్యత పై భారీ చర్చ! ఎందుకో తెలుసా?
గత కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ప్రచారాలు జరిగాయి. X వేదికగా “TRUMP IS DEAD” అనే హ్యాష్ ట్యాగ్ కూడా చాలా బాగా ట్రెండ్ అయింది. అయితే వీటన్నిటికి ముందు ట్రంప్ సివీఐ వ్యాధితో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి తోడు మళ్ళీ టెర్రిబుల్ ట్రాజెడీ సంభవిస్తే అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వ్యాఖ్యానించడం కూడా అప్పట్లో చర్చానియాంశంగా మారింది. అయితే నేడు ఈ అన్ని రూమర్స్ కి వైట్ హౌస్ ఖండించడం జరిగింది. మరోవైపు ట్రంప్ కూడా నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అని వివరణ ఇచ్చారు.
Read also : బంగాళాఖాతంలో అల్పపీడనం, 2 రోజులు భారీ వర్షాలు