తెలంగాణ

హైడ్రా కీలక నిర్ణయం.. ఇకపై హైడ్రా గ్రీవెన్స్‌, వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం(జనవరి 6) నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలిసారిగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు ఫిర్యాదులను హైడ్రా చీఫ్ స్వీకరించనున్నారు. అలాగే వారం రోజుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. హైడ్రా పీఎస్ ఏర్పాటుపై రేపు (ఆదివారం) అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను 10 రోజుల్లోపు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. హైడ్రా మరో ముందడుగు వేసింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్ర గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది.

Also Read : రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి సర్కార్ కసరత్తు.. దశల వారీగా విక్రయానికి నిర్ణయం!!

ఇకపై హైడ్రా గ్రీవెన్స్ ప్రతీ సోమవారం ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైడ్రా పోలీస్‌స్టేషన్‌ కూడా సంక్రాంతికి ప్రారంభంకానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా సేవలను అందుబాటులో ఉంచనున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా గ్రీవెన్స్‌కు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌లో పాల్గొననున్నారు. బుద్ధభవన్‌లో జరుగనున్న ఈ గ్రీవెన్స్‌లో ముఖ్యంగా నాలాలు, చెరువులు, ఇతర ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు ఏవి వచ్చినా సరే న్యాయపరంగా ఇబ్బందులు కాకుంగా వారం నుంచి పది రోజుల్లోపు ఫిర్యాదుదారులు ఇచ్చిన కంప్లైంట్‌లను క్లియర్ చేసే విధంగా హైడ్రా ఓ ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. గత నెలలోనే హైడ్రా గ్రీవెన్స్ ప్రారంభంకావాల్సి ఉంది. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా హైడ్రా గ్రీవెన్స్‌తో పాటు హైడ్రా పోలీస్‌స్టేషన్‌ అందుబాటులోకి రానుంది.

Read Also : బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ప్రియురాలి కోసం యువకుని దారుణహత్య!!

డీఎస్పీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఐలు, ఎస్‌ఐలు కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలు, కుంటల కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదువేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నగర శివారుల ప్రాంతాలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల నుంచి ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి స్థానిక ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది గ్రీవెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారు హాజరుకానిపక్షంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. మరోవైపు ఆక్రమణలపై హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోతోంది. ఇటీవల కాలంలో ఖాజాగూడ, మల్కాజ్‌గిరిలో ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా వద్దకు వస్తే తప్పకుండా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఫిర్యాదుదారుడు అనుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
  2. జగన్ హయాంలో ఐదు లక్షల కోట్ల అప్పు!… ఫైరైన అచ్చెన్నాయుడు?
  3. అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్!.. కానీ దేశం వదిలి వెళితే కఠిన చర్యలు?
  4. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్
  5. రెండు ఎకరాలతో… దేశంలోనే రిచెస్ట్ సీఎం అయిపోతారా?… రోజా ట్వీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button