
చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సకలం చెరువులో కట్టిన ఒవైసీ కాలేజీ కూల్చివేతపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. అక్బర్ కాలేజీ ని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరు అడుగుతున్నారని.. అయితే కాలేజీని ఎఫ్ఎటీఎల్ లో నిర్మించినందున గత సెప్టెంబర్ లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తుందని చెప్పారు. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరన్నారు.
ఒవైసీ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని.. పేద ముస్లిం మహిళలను వెనుకబాటి తనం నుంచి విముక్తి కల్పిస్తున్నారని రంగనాథ్ తెలిపారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడానికి వెనుక ముందు ఆడుతున్నామన్నారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామన్నారు.
25 ఎకరాల సరస్సును ఫ్లాట్ గా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడు కట్టడాలను కూడా కూల్చేసామని రంగనాథ్ వెల్లడించారు.ఎంఐఎం నాయకులు నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామన్నారు. చంద్రన్న గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నామని.. సామాజిక కారణాలవల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామన్నారు. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని.. దాని పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నామని వెల్లడించారు.