
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో హైడ్రా అధికారులు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వేట సాగిస్తున్నారు. బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్లు స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో రంగంలోకి దిగారు. ప్రభుత్వ స్థలం చుట్టూ కంచె ఏర్పాటుచేసి ప్రభుత్వ స్థలాన్ని రక్షించారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ స్థలాలను గుర్తించి వాటిని హైడ్రా కూల్చి వేస్తుంది. దీనిపై చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేయగ… మరి కొంతమంది ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Read also : వైసీపీలోకి అడుగుపెట్టనున్న వర్మ.. వార్తల్లో నిజమెంత?
Read also : గురుకులంలో తిండి లేక.. కలెక్టర్ కోసం గోడ దూకిన 70 మంది విద్యార్థులు