
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రపంచ ప్రఖ్యాత పొందినటువంటి ఆహార రేటింగ్ సంస్థ ‘టేస్ట్ అట్లాస్’ తాజాగా 2026 కు సంబంధించి బెస్ట్ ఫుడ్ జాబితాను విడుదల చేసింది. ఇందులో మన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే హైదరాబాద్ అంటేనే ప్రతి ఒక్కరికి బిర్యానీనే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2026 బెస్ట్ ఫుడ్ జాబితాలో హైదరాబాద్ బిర్యాని చోటు సంపాదించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత పొందినటువంటి ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల విడుదల చేసిన టాప్ 100 డిషష్ జాబితాలో 72వ స్థానంలో మన హైదరాబాద్ బిర్యానీ నిలిచింది. అలాగే ప్రపంచంలోనే టాప్ 50 బెస్ట్ రైస్ డిషెష్ లో 10వ స్థానాన్ని దక్కించుకొని మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. సాధారణంగా హైదరాబాద్ బిర్యానీ అంటే సువాసభరితమైన బాస్మతి రైస్ అలాగే మసాలాలు మిక్స్డ్ అయి అద్భుతమైన విందుగా ఉంటుంది. ఇందుమూలంగానే హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ పర్యటనకు వెళ్తే ఖచ్చితంగా అక్కడి బిర్యానీ ని టేస్ట్ చేయకుండా మాత్రం తిరిగి వెళ్ళరు.
Read also : BIG BREAKING: ఇక వైన్ షాపులు బంద్
Read also : Government: రేషన్ కార్డు ఉన్నవారికి GOOD NEWS





