క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఈ ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన ఆక్రమణలను మంగళవారం నాడు హైడ్రా కూల్చివేసింది. నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించింది. 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అయితే ఖాజాగూడ కూల్చివేతల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also : తాగి రోడెక్కారో అంతే సంగతి.. తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ!!
హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేసారంటూ ఆవేదన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారాలు దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో ఈరోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది.. కూల్చివేతలు చేపట్టింది. దుకాణాల్లోని సామానులను తీసుకునే సమయం కూడా వ్యాపారులకు హైడ్రా ఇవ్వని పరిస్థితి. సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో కూల్చివేతల్లో దుకాణాల్లో ఉన్న ఫ్రిజ్‌లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఖాజాగూడా భగీరధమ్మ చెరువు ఆక్రమణలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఖాజాగూడా భగీరధమ్మ చెరువుపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది పరిశీలించారు.
Also Read : దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు!… మరి రేవంత్ స్థానం?
ఆక్రమణలు నిజమే అని నిర్ధారించిన హైడ్రా… అక్కడి వ్యాపారులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన అనంతరం కూల్చివేతలకు సిద్ధపడింది హైడ్రా. అనుకున్న విధంగానే ఈరోజు ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది చెరువుపై అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టింది. జేసీబీల సాయంతో ఆక్రమణలను తొలగించే పనిలో పడింది హైడ్రా. హైడ్రా సిబ్బందిని అడ్డుకునేందుకు వ్యాపారులు యత్నించారు. నోటీసులు ఇచ్చిన తక్షణమే కూల్చివేతలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హైడ్రా సిబ్బంది తమ కూల్చివేతలను కొనసాగించారు. భారీగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కూల్చివేతలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టారు. దీంతో భారీ భద్రత నడుమ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా సిబ్బంది.
ఇవి కూడా చదవండి :
- ఇంత పెద్ద మొత్తం.. సంధ్య థియేటర్‌లో సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’!!
- గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..
- ట్రెండింగ్ లో GOOD BYE… 2024!
- ఎక్సైజ్ కానిస్టేబుల్ తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాసలీలలు..!
- బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన