క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీని అరికట్టడానికి మరియు ప్రజారోగ్యాన్ని కాపాడటానికి హైదరాబాద్ పోలీసులు H-FAST (Hyderabad Food Analysis and Surveillance Team) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ టీమ్ సమన్వయంతో పనిచేస్తుంది.

ఈ టీం హోటళ్లు, రెస్టారెంట్లు మరియు తయారీ కేంద్రాలలో ఆహార నాణ్యతను పర్యవేక్షించడం. కల్తీ జరిగినట్లు సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి శాంపిల్స్‌ను సేకరించడం.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరియు అవసరమైతే విక్రయశాలలను మూసివేయడం.
ఆహార కల్తీ జరిగితే వెంటనే ఈ కింది కాంటాక్ట్ నంబర్లతో పిర్యాదు చెయ్యండి:
H-FAST టోల్ ఫ్రీ నంబర్: 8712661212. ఇది ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీసుల ‘హెచ్-ఫాస్ట్’ (Hyderabad Food Adulteration Surveillance Team) విభాగానికి సంబంధించిన ఫిర్యాదుల కోసం కేటాయించబడింది.
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ హెల్ప్‌డెస్క్: 9100105795. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
GHMC కాల్ సెంటర్: 040-21111111. హోటళ్లు లేదా రెస్టారెంట్లలో అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహారంపై ఫిర్యాదు చేయడానికి ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు.
