
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపిస్తే చాలు జనం రెచ్చిపోతున్నారు. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలపై నిలదీస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ప్రజాగ్రహంతో జనంలోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో కలిసి సభలకు వెళ్లడానికి అధికారులు భయపడుతున్నారని చెబుతున్నారు.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఏకంగా మంత్రి దామోదర రాజనర్సింహను బూతులు తిట్టారు మహిళలుయ తన సొంత నియోజకవర్గం ఆందోల్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి దామోదర రాజనర్సింహ. అయితే సభకు వచ్చిన మహిళలు బహిరంగంగానే బూతుపురాణం అందుకున్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తే, రేషన్ కార్డులు లేని తాము ఏమైపోవాలని మంత్రిని మహిళలు నిలదీశారు.ఇచ్చిన మాట ప్రతిసారీ తప్పుతున్నారని మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపే ఇస్తామని చెప్పి 15 నెలులుగా చెబుతూ వస్తున్నారని ప్రశ్నించారు. మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ. దీంతో మహిళల తిట్లను వీడియోలు తీయకుండా అష్టకష్టాలు పడ్డారు పోలీసులు, నాయకులు