
– ఆగని భార్య చేతిలో భర్త మరణాలు
– ప్రతిరోజు ఒక మరణమైన ఉండాల్సిందే..
– భవిష్యత్తులో మరిన్ని మరణాలు చూడాల్సి వస్తుందో?…
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్న సంఘటనలు ఈ మధ్య ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఏమి లోకమో తెలియదు కానీ భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్నారు. వీటన్నిటికీ అక్రమ సంబంధాలే కారణమని.. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. పెళ్లికి ముందు లవర్ ఉన్నారని చెప్తే ఆ భర్త పెళ్లి చూసుకోకుండా ఉంటాడు కదా… కానీ అలా చెప్పకుండా పెట్టకుండా పెళ్లి చేసుకుని అమాయకమైన ఒక మనిషిని బలి తీసుకుంటుంది. ప్రస్తుతం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే.. భార్య ప్రియుడు ఎక్కడ చంపేస్తుందని అనునిత్యం భయపడుతూ ఉండాల్సి వస్తుంది. అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే లవర్ తల్లిదండ్రులు ఎక్కడ చంపేస్తారు అని భయపడాల్సి వస్తుంది. అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఇంట్లోని తల్లిదండ్రులు ఒత్తిడి తట్టుకునేది కాదు.
కాగా తాజాగా ఢిల్లీకి చెందిన కరుణ్ దేవ్ మరియు తన భార్య సుస్మిత కొన్ని రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య సుస్మిత తన ప్రియుడుతో కలిసి అతికిరాతకంగా తన భర్తను చంపేసింది. తరుణ్ దేవ్ కు వరుసకు సోదరుడు రాహుల్ కు దగ్గర అయ్యింది ఆమె భార్య సుస్మిత. ఇక ప్రియుడు రాహుల్తో కలిసి సుస్మిత తన భర్తను అడ్డు తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే భోజనంలో 15 నిద్ర మాత్రలు కలిపి తన భర్తకు అన్నం తినమని చెప్పింది. అయినా కూడా తన భర్త చనిపోకపోవడంతో… వెంటనే తన ప్రియుడు రాహుల్ కి ఇన్స్టాలో తన భర్త చనిపోలేదని ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పమని తన ప్రియుడికి మెసేజ్ చేసింది. అయితే వెంటనే తన ప్రియుడు నీ భర్తకు కరెంట్ షాక్ ఇవ్వమని మెసేజ్ చేసాడు. అనుకున్నట్టుగానే సుష్మిత తన భర్త తరుణ్ దేవ్ కు కరెంట్ షాక్ ఇవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే పోలీస్ కస్టడీలో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ షాక్ తోనే చనిపోయాడు అని అనుకోగా… తాజాగా ఇన్స్టా చాటింగ్ ద్వారా వీళ్ళ అసలు రూపం బయటకు తెలిసిపోయింది. దీంతో చాలా మంది ఈ వార్తలు వింటున్న ప్రేక్షకులు… ఇంక ఎన్ని ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది అని ఆందోళన చెందుతున్నారు.