
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- వినాయక చవితి పండుగకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పండుగకు చాలానే షాపింగ్ మాల్స్ అలాగే ఎలక్ట్రిక్ కంపెనీలు భారీ ఆఫర్స్ ఎప్పుడు ప్రకటిస్తాయో అని ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి వినాయక చవితి పండుగ పురస్కరించుకొని డి మార్ట్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తుంది. కేవలం సగం దరకే చాలానే వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి అందులో ఏ వస్తువులు సగం ధరకే లభిస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read also : విగ్రహాలను ధ్వంసం చేస్తారా?.. ఒక్కొక్కరి తాట తీస్తా : చంద్రబాబు
ప్రస్తుతం వంటగదికి కావాల్సినటువంటి నిత్యవసర సరుకులు పై భారీ డిస్కౌంట్ నడుస్తున్నాయి. డి మార్ట్ వారు ప్రత్యేకంగా వంటగదిలోకి కావాల్సినటువంటి కొన్నిటిపై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆర్గానిక్ కందిపప్పు కేజీ అసలు ధర 365 రూపాయలు కాగా, డి మార్ట్ లో ప్రస్తుతం 182 రూపాయలకే లభిస్తుంది. ఈస్టర్న్ కారంపొడి 200 రూపాయలు ఉండగా.. వంద రూపాయలకే లభిస్తుంది. పప్పులు మొదలుకొని… మసాలాలు వంటివి వరకు కూడా డీమార్ట్ లో సగం దరకే అందుబాటులో ఉన్నాయి.
Read also : బీహార్ ఓటర్ లిస్టులో పాకిస్తానీల పేర్లు, విచారణకు ఆదేశం!
చాక్లెట్స్ మరియు బిస్కెట్స్ పై కూడా భారీగానే డి మార్ట్ డిస్కౌంట్స్ అందిస్తుంది. మీ పిల్లల కోసం ఏమైనా చాక్లెట్లు లేదా బిస్కెట్లు కొనాలంటే ఇదే సరైన సమయం గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ 200 రూపాయలు ఉన్న చాక్లెట్లు కేవలం 90 రూపాయలకు మాత్రమే లభిస్తున్నాయి. అలాగే చిప్స్ కూడా 150 రూపాయలకు పైగా ఉన్నవి 70 రూపాయలకు మాత్రమే లభిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వినాయక చవితి పండుగకు చాలానే సగం ధరకే లభిస్తున్నాయి. చిన్న వస్తువులకు మాత్రమే కాకుండా పెద్దపెద్ద వస్తువులకు కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఉదాహరణకు.. ఐదు లీటర్ల స్టీల్ కుక్కర్ 4,900 రూపాయలు ఉండగా… డి మార్ట్ లో కేవలం 1950 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ వారం డీ మార్ట్ లో గ్రోసరీస్, కిచెన్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, ఫర్నిచర్ మరియు హోమ్ డెకార్ వంటి అన్ని రకాల వస్తువులపై 50% డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. మరికొన్ని ఉత్పత్తులపై ఏకంగా 60 నుంచి 70% వరకు డిస్కౌంట్ లు ఉన్నాయి. కేవలం పండుగ ఈ నెలాఖరు చివరిలోపు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్లను వినియోగం చేసుకోవాలని చాలామంది ఇప్పటికే డి మార్ట్లకు క్యూ కడుతున్నారు.
Read also : అమరావతి పై వైసీపీ ఫేక్ ప్రచారం.. తీవ్రంగా మండిపడ్డ సీఎం!