
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ప్రజలు ఒక పార్టీపై నమ్మకం పెట్టుకుంటే ఏ స్థాయిలో ఆ పార్టీపై అభిమానం చాటుతారు అనేది కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. అయితే తాజాగా బీజేపీ పార్టీకి విరాళాల రూపంలో తమ అభిమానిని చాటుకున్నారు ప్రజలు. కేవలం రెండు సంవత్సరాల లోనే అత్యధికంగా విరాళాలు వచ్చాయి. 2024-2025 సంవత్సరాలలో మొత్తంగా అన్ని పార్టీలకు కలుపుకొని ఏకంగా 3811 కోట్ల విరాళాలు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువగా బీజేపీకి అత్యధికంగా 3112 కోట్లు రావడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. అంటే మొత్తం విరాళాలలో 82% బిజెపి పార్టీకే వచ్చాయి. ఇక ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి 299 కోట్లు వచ్చాయి. అంటే కేవలం 8 శాతం మాత్రమే ఈ రెండు సంవత్సరాలలో ఈ పార్టీ విరాళాలు పొందింది. ఇక ఇతర అన్ని పార్టీలు కలుపుకొని 400 కోట్లు (10%) విరాళాలు సంపాదించాయి. ఇవన్నీ దేశవ్యాప్తంగా తొమ్మిది ఎలక్ట్టోరల్ ట్రస్టుల ద్వారా అందాయి అని అధికారులు తెలిపారు. అయితే గత సంవత్సరంలో సుప్రీంకోర్టు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో విరాళాలు ఇవ్వడాన్ని రద్దు చేసిన విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. గతంలో 2023-24 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 1218 కోట్ల విరాళాలు రాగా ఈ సంవత్సరం ఏకంగా 3811 కోట్ల విరాళాలు అందాయి. దీంతో ఈ విరాళాల తోనే పార్టీలకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ప్రధాన పార్టీలలో అత్యధికంగా బిజెపి పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లుగా సమాచారం.
Read also : బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడి.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!
Read also : ఎంట్రీ ఇవ్వగానే ఫైర్.. నిన్నటి వరకు ఒక లెక్క! ఈరోజు నుంచి మరో లెక్కంటూ కేసీఆర్ స్పీచ్





