
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి:- రంగారెడ్డి జిల్లాలో అబార్షన్ చేయించే క్రమంలో యువతి మృతి చెందిన దారుణ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం స్థానికంగా పనిచేస్తున్న హోంగార్డ్ మధుసూదన్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేశాడు. ఆ సంబంధం కారణంగా యువతి గర్భవతి అయ్యింది. దీనితో మధుసూదన్, యువతి గర్భాన్ని తొలగించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజా వద్దకు తీసుకెళ్లాడు. అయితే అబార్షన్ సమయంలో తీవ్ర రక్తస్రావం జరగడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన మధుసూదన్, పరిస్థితి విషమించడంతో సంఘటన స్థలం విడిచి పారిపోయాడు.
Read also : వాళ్ళిద్దరూ ఒక్కసారి చర్చిస్తే చాయ్ తాగే లోపు పని అయిపోతుంది : కేటీఆర్
స్థానికులు సమాచారమివ్వడంతో శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధుసూదన్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించగా, ఆర్ఎంపీ డాక్టర్ పద్మజా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమెపై అనధికార వైద్య కార్యకలాపాలు మరియు నిర్లక్ష్య కారణంగా మరణం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న డాక్టర్‌ను త్వరలోనే పట్టుకుంటాం, అని శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కూడా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న సందర్భంగా అధికారులు కూడా కొన్నిటిపై శ్రద్ధ వహించి ముందుగానే కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Read also : రైల్లో మహిళపై దారుణంa. కత్తితో బెదిరించి అత్యాచారం.!