Tuesday, March 3, 2026
Homeతెలంగాణమస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోళీ వేడుకలు

మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోళీ వేడుకలు

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రినగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ యువతి యువకులు, పిల్లలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు వివిధ రకాల రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ప్రేమ-స్నేహం కలయికే హోలీ పండుగని చెప్పిన మస్తాన్ రెడ్డి..అందరి జీవితాలు ఎప్పుడు రంగులమయంగా ఉండాలని కోరుకున్నారు. అందరి జీవితాల్లో హోలీ పండుగ వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ వేడుకల్లో V TEAM ప్రధాన కార్యదర్శి రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు చెల్లయ్య, ఆది నారాయణ,సతీష్ రెడ్డి, పవన్ కుమార్,సత్య నారాయణ,బొంత రవి,మల్లేశ్, శ్రీశైలం యాదవ్ , రమేశ్ తో పాటు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments