
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ నటించినటువంటి ఛాంపియన్ మూవీ ఈనెల చివర ఆఖరిలో ఓటీటీ లోకి రానుంది. రోషన్ నటించినటువంటి ఛాంపియన్ మూవీ ఈనెల 29వ తేదీన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. డిసెంబరు 25వ తేదీన విడుదలైనా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను సాధించింది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ సినిమా ను క నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా కీలక ప్రకటన చేసింది . ఇక ఈ సినిమాలో హీరో రోషన్ కు జోడిగా నటించినటువంటి హీరోయిన్ అనస్వర రాజన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. కాగా ఈ సినిమాలోని “గిరగిరా” సాంగ్ ఇప్పటికీ కూడా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లలో ఫుల్ ట్రెండింగ్లో తన హవా కొనసాగిస్తుంది.
Read also : ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. చాలా రోజులకు మెరుగుపడిందిగా?
Read also : ఇంట్లో ఎవరూ లేరని ప్రియుడిని పిలిచిన యువతి.. తర్వాత షాక్ (VIDEO)





