
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఐ బొమ్మ రవి సినిమా పైరసీ చేసినందుకుగాను అతనిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తన భార్యనే రవిని పోలీసులకు పట్టించినట్లుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే ఐ బొమ్మ రవి మొదటినుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడు అని పోలీసులు తాజాగా జరిపిన విచారణలో తేలినట్లు సమాచారం. నిన్నటి వరకు రవిని విచారణ చేసిన పోలీసులు తాజాగా అతని భార్యను విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా రవి భార్య రవిపై కీలక సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. తనతోపాటు కూతురిని కూడా చిత్రహింసలకు గురిచేసాడు అని ఆమె పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. ఇక రవితో విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం అతని ప్రవర్తన నచ్చకనే అని ఆమె వెల్లడించారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలాగే ఐ బొమ్మ అనే వెబ్సైట్ డిజైన్ కు, పోస్టర్లకు ప్రతినెలా కూడా తన స్నేహితుడు నిఖిల్ కు 50 వేల రూపాయలు ఇచ్చి అప్డేట్ చేయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా ఇప్పటికే ఈ ఐ బొమ్మ అనే వెబ్సైట్ ద్వారా ఏకంగా 100 కోట్ల వరకు సంపాదించాడు అని పోలీసులు తాజాగా తెలిపిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నడంతో పూర్తిగా అసలు ఎలాంటి విధంగా ఈ విషయం ముగుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది రవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Read also : Telangana politics: బీఆర్ఎస్‌కు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు
Read also : రైతులకు గుడ్ న్యూస్… తడిసిన ధాన్యం కూడా కొనుగోళ్లు!





