క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: భార్య వంట చేయలేదనే, ఇతర కుటుంబ సభ్యులతో సరిగా ఉండటం లేదని పేర్కొంటూ ఓ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. భార్య వంట చేయలేదనే కారణంతో భర్త విడాకులు కోరడం చెల్లదని, అది క్రూరత్వం (Cruelty) కిందకు రాదని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పునిచ్చింది.
హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, వంట చేయకుండా తన తల్లికి సాయం చేయడం లేదని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ కారణాల వల్ల తాను మానసికంగా హింసకు గురవుతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, వంట వండటం లేదని, కేవలం వంట చేయకపోవడం లేదా ఇంటి పనులు చేయకపోవడం అనేది భర్తపై శారీరక లేదా మానసిక క్రూరత్వం చూపినట్లు కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న మనస్పర్థలు లేదా గృహ సంబంధిత పనుల విషయంలో వచ్చే ఇబ్బందులను విడాకులకు ప్రాతిపదికగా తీసుకోలేమని కోర్టు అభిప్రాయపడింది.





