![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-22.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు తెలిపారు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీని టార్గెట్ చేస్తూ నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్విరాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదం రేపాయి. మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని , చివరిగా మేకలు ఎన్ని ఉన్నాయని లెక్కపెడితే కరెక్టుగా 11 మాత్రమే ఉన్నాయని తెలిపారు. దీంతో పృధ్విరాజ్ ఇన్ డైరెక్ట్ గా వైసీపీ ని టార్గెట్ చేశారని వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. లైలా సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు.
మహా కుంభమేళాలో దర్శనం ఇచ్చిన విజయ్ దేవరకొండ!..ఇలా ఉన్నాడేంటి బాబోయ్?
అయితే ఈ విషయంపై వైసిపి కార్యకర్తలకు మరియు నాయకులకు విశ్వక్సేన్ క్షమాపణలు చెప్పారు. వేదికపై ఆయన మాట్లాడేటప్పుడు మేము లేము. ఉండి ఉంటే నేను వెంటనే మైక్ గుంజుకునే వాడినని తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సినిమాను ఆడనివ్వము బాయ్కాట్ చేస్తామంటూ 25 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయని తెలిపారు. అలాగే హెచ్డి ప్రింట్ కూడా రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సినిమాలో పనిచేసిన ఒక వ్యక్తి వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని, ఆయన ఏదో ఆత్మ తృప్తికి అలా గంటే దానికి మేము బాధ్యులం కాదు అని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని తెలిపారు. నేను నటించిన మూవీని చంపేయోద్దంటూ మీ సపోర్ట్ మాకు కావాలి అంటూ విశ్వక్సేన్ వేడుకున్నారు.
అరవింద్ కేజ్రివాల్ ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణం: ఎన్నికల వ్యూహకర్త